Madhapur : క్షణాల్లో పేక మేడల్లా రెండు భారీ భవనాలు కూల్చివేత

Madhapur Two Buildings demolition : భవనాలు కట్టడానికి సంవత్సరాల సమయం పడుతుంది.కానీ కూల్చటానికి క్షణాల సమయం చాలు అనేలా మారింది టెక్నాలజి. వేగంగా మారిపోతున్న టెక్నాలజీ భవనాలకు క్షణాల్లో పేక మేడడ్ని కూల్చినట్లుగా కూల్చేస్తోంది. పక్కనున్న భవనాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చిన్న రాయి కూడా పక్కన పడకుండా ఉన్న చోటనే కుప్పకూలిపోయేలా మారింది టెక్నాలజి..

అటువంటి అధునాత టెక్నాలజీతో హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో రెండు భారీ భవనాలకు పేకపేడల్లా కూల్చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో నాలుగు అంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి.

Telangana : తోపుడు బండిపై మద్యం అమ్మకాలు .. ఎగబడి కొనేస్తున్న మందుబాబులు

ఈ భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం కోసం రెండు భారీ భవనాలకు క్షణాల్లో పేక పేడల్ని కూల్చేసినట్లుగా కూల్చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు భవనాలను నిమిషాల్లోనే కూల్చేశారు. పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ భవనాలను పేకమేడల్లా కూల్చేశారు.

ట్రెండింగ్ వార్తలు