Minister KTR : ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా .. డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

Minister KTR :  ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా .. డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆదేశాలు

Etela Rajender security..minister KTR phone

Etela Rajender security..minister KTR phone : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender )భద్రత (security)గురించి మంత్రి కేటీఆర్ (Minister KTR )ఆరా తీసాశారు. డీజీపీ అంజనీ కుమార్ (dgp anjani kumar)కు ఫోన్ (Phone)చేసి వివరాలు తెలుసుకున్నారు.ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ (Senior IPS)తో సమీక్షించాలని సూచించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆయన్ని చంపాలని చూస్తున్నారు అంటూ ఈటల రాజేందర్ భార్య (Etela Rajender Wife)జమున (jamuna) ప్రెస్ మీట్ లో పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపించిన కేవలం గంటల వ్యవధిలోనే కేంద్రం వెంటనే స్పందించింది.

Eatala Rajender : కేంద్రం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై-కేటగిరీ భద్రత..!

ఈటల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు వై-కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో డీజీపీ ఈటలకు భద్రత పెంపు విషయంలో సమీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం సీనియర్ డీజీపీ ఈటల నివాసానికి వెళ్లనున్నారు.

కాగా తన భర్త ఈటల రాజేందర్ (Etela Rajender )హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున (Etela  Jamuna )సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇచ్చైనా ఈటల రాజేందర్ ను హత్య చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి (BRS MLC Kaushik Reddy)అన్నట్లు ఈటల జమున ఆరోపించడం రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో ఈటలకు భద్రత పెంపునకు ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రం వై-కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత విషయంలో చొరవ చూపింది.దీంట్లో భాగంగానే మంత్రి కేటీఆర్ (Minister KTR )ఆదేశాలతో ఈటల భద్రత పెంపు విషయంలో డీజీపీ అంజనీ కుమార్ (dgp anjani kumar)సమీక్ష నిర్వహిస్తున్నారు.

Also Read..Eatala Jamuna : ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున