×
Ad

KTR in Metro Rail : హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన కేటీఆర్.. సెల్ఫీలతో సందడి చేసిన ప్రయాణికులు

కేటీఆర్ ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రయాణీకులతో ముచ్చటించారు.

  • Published On : November 24, 2023 / 05:38 PM IST

KTR traveled in Hyderabad Metro Rail

KTR traveled in Hyderabad Metro Rail : తెలంగాణలో ఎన్నిక ప్రచారంలో మంత్రి కేటీఆర్ దూసుకుపోతున్నారు. పలు రంగాలకు చెందినవారితో కలిసిపోతూ వినూత్న ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. దీంట్లో భాగంగా కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICCలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన తర్వాత రహేజా మైండ్‌స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించారు.

రైల్లో ప్రయాణించేవారు కేటీఆర్‌తో మాట్లాడేందుకు.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. కేటీఆర్ కూడా వారితో చక్కగా కలిసిపోయి మాట్లాడారు. ఉద్యోగులు, విద్యార్ధులు ఇలా అందరితోను కలివిడిగా మాట్లాడారు. వారి ప్రయాణం గురించి.. చదువు, ఉద్యోగాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడటం.. ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవటం ఇలా మెట్రోలో సందడి వాతావరణాన్ని సృష్టించారు.

ఇలా ప్రతీ స్టేషన్‌లోను రైలు ఆగటం.. అక్కడ ఎక్కిన ప్రయాణికులు రైల్లో కేటీఆర్ ఉన్నారని తెలుసుకుని వచ్చి మరీ ఆయనతో మాట్లాడటం.. సెల్ఫీలు తీసుకోవటానికి ఆసక్తి చూపించారు. చదువుకునేవారికి.. ఉద్యోగాల కోసం యత్నంలో భాగంగా కోచింగ్ తీసుకునేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఎక్కినప్పటినుంచి నుంచి బేగంపేట్‌లో దిగే వరకు ప్రతి ఒక్కరు కేటీఆర్‌ని పలకరించటానికి.. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. మెట్రో సిబ్బందితోనూ కేటీఆర్ సెల్ఫీలు దిగారు.