Kaithalapur flyover: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. నేడు కైతలాపూర్ ఆర్ఓబీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

కూకట్ పల్లి - హైటెక్ సిటీల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైటెక్ సిటీ - బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన కైతలాపూర్ ఆర్వోబీని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ తో కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది.

Kaithalapur flyover: కూకట్ పల్లి – హైటెక్ సిటీల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైటెక్ సిటీ – బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన కైతలాపూర్ ఆర్వోబీని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ తో కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి.

Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం ఫలాలు నగరానికి నలువైపులా అందుతున్నాయి. ఎస్ఆర్ఢీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో 29 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే కైతలాపూర్ ఆర్వోబీ నిర్మాణం కూడా పూర్తయింది. ఈ వంతెనను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

Basara IIIT Students: వెనక్కి తగ్గిన విద్యార్థులు.. మంత్రి హామీతో ఆందోళన విరమణ

రూ. 86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ – కూకట్ పల్లి, జేఎన్టీయూ – హైటెక్ సిటీ వెళ్లే వారికి ప్రయాణం సులువవుతుంది. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ట్రెండింగ్ వార్తలు