Minister Ponnam Prabhakar : అధికారం కోల్పోయిన మాజీ మంత్రులు విచక్షణ కోల్పోయారు.. ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటాం

ఎన్ఎస్ యూఐ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగానని పొన్నం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మొన్నటి వరకు లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Minister Ponnam Prabhakar

Telangana Congress : అధికారం కోల్పోయిన మాజీ మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అదికాలేదు.. ఇది కాలేదు.. అని విమర్శిస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు ఆగం పట్టించారని పొన్నం విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారెంటీ స్కీములు మొదలు పెట్టినం.. 119 నియోజకవర్గాల్లో రెండు గ్యారెంటీ స్కీములు అమలవుతున్నాయని పొన్నం చెప్పారు.

Also Read : Bahujan Samaj Party : బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన…తన రాజకీయ వారసుడు ఎవరంటే…

ఎన్ఎస్ యూఐ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగానని పొన్నం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మొన్నటి వరకు లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజా సమస్యలను వినడానికి, వాటిని పరిష్కరించడానికి మేం సిద్ధంగా ఉన్నామని పొన్నం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కు ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనం రెండు గ్యారెంటీలు అమలు చేయడమని పొన్నం అన్నారు.

Also Read : Minister Komatireddy Venkat Reddy : చారిత్రక భవనాలను పునరుద్ధరిస్తాం.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండదని మంత్రి పొన్నం అన్నారు. ఆటో డ్రైవర్ల బాధల గురించి చర్చిస్తామని, పరిగణలోకి తీసుకుంటామని, అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో ఆస్తులు వేరువేరుగా పెట్టారు.. రద్దయిన సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని, ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.