Hyderabad: ఆటిజం బాలికపై రైలులో లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ - సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ..

Hyderabad: ఆటిజం బాలికపై రైలులో లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

sexual assault

Updated On : April 5, 2025 / 2:17 PM IST

Hyderabad: పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ – సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్థరాత్రి సమయంలో వాష్ రూమ్ కు వెళ్లిన బాలిక నోరుమూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యానంతా వీడియో తీశాడు. విషయాన్ని బయటకు చెప్పే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు.

 

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ఇంజనీర్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూడటానికి ఈనెల 2న రక్సెల్ – సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరింది. ఆ దంపతులకు ఆటిజంతో బాధపడుతున్న 12ఏళ్ల పెద్ద కూతురు ఉంది. అర్థరాత్రి సమయంలో రైలులో అందరూ నిద్రపోతున్న సమయంలో బాలిక వాష్ రూమ్ కు వెళ్లింది. వాష్ రూమ్ డోర్ వద్ద నిలబడిన యువకుడు బాలిక నోరునొక్కి వాష్ రూమ్ లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

 

ఇతర ప్రయాణీకుల సాయంతో నిందితుడిని బాలిక తండ్రి పట్టుకున్నాడు. ఫోన్ తనిఖీ చేయగా అందులో వీడియోలు కనిపించాయి. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నవంబర్ కు ఫోన్ చేశాడు. గురువారం ఉదయం రైలు సికింద్రాబాద్ కు చేరుకున్నాక బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.