Jagga Reddy On Fire : కాంగ్రెస్‌లో మరో కలకలం.. రేపు సంచలన ప్రకటన చేయనున్న జగ్గారెడ్డి

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.(Jagga Reddy On Fire)

Jagga Reddy On Fire : సంచలన ప్రకటనలకు, పోరాటాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది ప్రజా సమస్యల మీదనో, ఇతర పార్టీల మీద చేసే ప్రకటనల్లోనూ కాదు. వారిలో వారే కుమ్ముకోవడం. వారిలో వారిపైనే ప్రకటనలు చేసుకోవడం. అంతర్గత సంక్షోభాలకు కేరాఫ్ అని ఇప్పటికే పేరు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త పంచాయితీ నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్యన ఏ గడ్డీ వేయకుండానే భగ్గుమనేలా ఉంటాయి పరిస్థితులు.

Telangana Politics : పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవరిస్తే గోడకేసి కొడతా : రేవంత్ రెడ్డి

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఆయన ఏం ప్రకటన చేయబోతున్నారు అన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

అన్ని పార్టీలలో కాంగ్రెస్ పార్టీ వేరయ అన్నట్లుగా ఉంటుంది ఆ పార్టీ నేతల తీరు. బయట పార్టీల నేతలకు పని కల్పించకుండా వారిలో వారే కుమ్ములాటలతో నిత్యం బిజీగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు సహా మరికొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సందు దొరికితే చాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడప్పుడు అధిష్టానం నుంచి వచ్చిన నేతల ఎంట్రీతో కాస్త మెత్తబడినట్లు కనిపించినా.. పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలానే ఉంటాయి పరిస్థితులు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాంగ్రెస్ లో ప్రస్తుత సంక్షోభానికి కారణం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్. హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలెవరూ కూడా కలవకూడదని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్లి మరీ సీఎం కేసీఆర్ సమక్షంలోనే యశ్వంత్ సిన్హాకు వెల్ కమ్ చెప్పారు. దీంతో కాంగ్రెస్ కు భారీ ఝలక్ తగిలినట్లు అయ్యింది. అయితే వీహెచ్ కు మద్దతుగా సిన్హాకు సీఎల్పీ తరుపున అధికారికంగా స్వాగతం పలికితే బాగుండేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సిన్హాను సీల్పీకి పిలిపించి మద్దతు ప్రకటిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.(Jagga Reddy On Fire)

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బహిర్గతం చేసింది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాగా, సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. దాంతో, ఆయన రాక పక్కా ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాను కలవకూడదని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ యశ్వంత్ సిన్హాను కలవడం పార్టీలో దుమారం రేపింది.

వీహెచ్… సిన్హాను కలవడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే బండకేసి కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం కలవడం ఏంటి… ఇదేమైనా చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా? అంటూ వీహెచ్ పై మండిపడ్డారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు.

యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు పలికినప్పుడు వీహెచ్ వెళ్లి కలవడంలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. “అయినా రాహుల్ కు లేని అభ్యంతరం నీకెందుకు? నువ్వు బండకేసి కొడితే పడి ఉండడానికి మేం పాలేర్లమా? అసలు, బండకేసి కొట్టడానికి నువ్వెవరు? ఎవర్ని కొడతావు బండకేసి? వీహెచ్ వయసుతో పోలిస్తే నువ్వో పోరగాడివి” అంటూ రేవంత్ పై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

ట్రెండింగ్ వార్తలు