Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ మాత్రం యశ్వంత్ సిన్హా పర్యటనకు దూరంగా ఉంటుంది.

Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Gandhi Bavan

Yashwanth Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ కు చేరుకుంటారు. జలవిహార్ లో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్ సిన్హా కోరనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం కానున్నారు.

Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ కూడా బలపరుస్తుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ వస్తున్న క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం ఆయన పర్యటనకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను మాత్రమే కలవనున్నారు. తొలుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ భేటీ కావాలని యశ్వంత్ సిన్హా భావించినట్లు తెలిసింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అందుకు విముకత వ్యక్తం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ నేతలను కలవడానికి వస్తున్న నేపథ్యంలో తాము కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి గడప తొక్కితే.. ఈ ఇంటి గడప తొక్కనివ్వం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కాకుండా రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హా కార్యాలయానికి సమాచారం అందివ్వడంతో ఆయన శనివారం టీఆర్ఎస్, ఎంఐఎం నేతలతో మాత్రమే భేటీ అయ్యి తిరిగి వెళ్తారు.