Telangana Politics : పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవరిస్తే గోడకేసి కొడతా : రేవంత్ రెడ్డి

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లిన వీహెచ్ పై పీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే గోడకేసి కొడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Politics : పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవరిస్తే గోడకేసి కొడతా : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On V Hanumantha Rao

Revanth Reddy fires on V Hanumantha Rao : రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు ఎవ్వరు వెళ్లవద్దని టీ.పీసీసీ తీర్మానించింది. కానీ ఈ తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు యశ్వంత్ సిన్హా స్వాగత కార్యక్రమానికి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. యశ్వంత్ సిన్హాను కలిసారు. దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీహెచ్ పై ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గోడకేసి కొడతాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి వీహెచ్ పై చేసిన కామెంట్లపై మరోకాంగ్రెస్ నేత..ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్చ చేసిన తప్పేంటి? ఎయిర్ పోర్టుకు వెళ్లటంలో ఏమాత్రం తప్పు లేదు అంటూ సమర్థించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే సమయంలో రాహుల్ గాంధీ ఆయన పక్కనే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి లేని అభ్యంతరం రేవంత్ రెడ్డికి ఎందుకు అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. విహెచ్ యశ్ంత్ సిన్హాను కలిసింది ఎయిర్ పోర్టులో కేసీఆర్ ఇంటి దగ్గరకాదు కదా? అంటూ ప్రశ్నించారు. యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లవద్దని చెప్పటానికి రేవంత్ రెడ్డి ఎవడు? ఆయనకు మేమేమన్నా పాలేరులుమా? సీనియర నేత అని కూడా చూడకుండా గోడకేసి కొడతాను అని అన్నంతుకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.

కాగా..రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ ఘన స్వాగతం పలికింది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం చెప్పారు. తెలంగాణ మంత్రులు.. కూడా ఇందులో పాల్గొన్నారు. తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్, కారు ర్యాలీ నిర్వహించింది.

యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.కాని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం యశ్వంత్ సిన్హాకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హాను కలవబోమని..కాంగ్రెస్ నేతలు కూడా ఎవ్వరు ఎయిర్ పోర్టుకు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు.రేవంత్ రెడ్డి ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన యశ్వంత్ సిన్హాను కలవొద్దని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. ఈక్రమంలో పీసీసీ చీఫ్ ఆదేశాలను బేఖాతరు చేసి ఎయిర్ పోర్టుకు వీహెచ్ వెళ్లటంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి ఆదేశాలు టీ.కాంగ్రెస్ లో నేతలకు కూడా మింగుడు పడనట్లుగా ఉంది.అందుకే వీహెచ్ వెళ్లారని తెలుస్తోంది.

అయితే హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ స్వాగత కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లవద్దని ఆదేశాలు ఇచ్చినా ఓ కాంగ్రెస్ సీనియర్ నేత బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వాగతం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఎయిర్ పోర్టుకు రావడమే కాదు.. సీఎం కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హాను కలిశారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా వీహెచ్ రావడంతో రేవంత్ రెడ్డికి షాక్ తగిలిందనే చర్చ సాగుతోంది.