Raja Singh : హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసి తీరుతాం.. పోలీసులు అడ్డుకున్నా, ఏదైనా ప్రాబ్లమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు.

MLA Raja Singh

Raja Singh – Ganesh Immersion : గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో యధావిధిగా చేసి తీరుతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. పోలీసులు అడ్డుకున్నా, ఏదైనా ప్రాబ్లమైనా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకపోవడంతోనే నిమజ్జనాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హుస్సేన్ సాగర్ లో గత 30 ఏళ్లుగా నిమజ్జనాలు చేస్తున్నామని ఇప్పుడు చేస్తామని చెప్పారు.

కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లతో నింపుతానన్న కేసీఆర్ హామీ ఏమైందో చెప్పాలని నిలదీశారు. గణేష్ నిమజ్జనం జలవనరులలో చేయవద్దని కోర్టు ఎక్కడా చెప్పలేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు భగవంత్ రావు అన్నారు.

Raja Singh : కనీసం లక్ష కూడా కట్టలేదు- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్

జలవనరులు కాలుష్యం కాకుండా చూడాలని మాత్రమే చెప్పిందని తెలిపారు. ఈమేరకు భగవంత్ రావు 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నీటి కాలుష్యం కాకుండా ప్రభుత్వ ఉన్నత అధికారులు నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. హిందువుల ఐక్యతని చూసి ఓర్వలేకనే హుస్సేన్ సాగర్ లో సామూహిక గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అన్ని కులాలు, మతాలు, వర్గాల వారందరూ ఒక దగ్గరకు చేరి నిర్వహించేదే గణేష్ నిమజ్జనం ప్రత్యేకత అన్నారు. దీన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఏడాది ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షకుపైగా విగ్రహాలు కొలువు తీరాయన్నారు. కచ్చితంగా హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగి తీరుతుందన్నారు. నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు జరిపారని పేర్కొన్నారు. ప్రశాంతంగా నిమజ్జన తంతు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు