MLA Sandra Venkata Veeraiah: తప్పుడు ఆరోపణలతో తండ్రిలాంటి కేసీఆర్ ని విమర్శిస్తే సహించం: ఎమ్మెల్యే సండ్ర
తప్పుడు ఆరోపణలతో తండ్రిలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శిస్తే సహించబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. స్వార్థ పూరిత,కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు. అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులు గమనించాలని అన్నారు.

MLA Sandra Venkata Veeraiah
MLA Sandra Venkata Veeraiah: తప్పుడు ఆరోపణలతో తండ్రిలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శిస్తే సహించబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. స్వార్థ పూరిత,కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు. అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులు గమనించాలని అన్నారు.
అన్ని వర్గాల సమస్యలపై దృష్టి పెట్టి కేసీఆర్ పని చేస్తున్నారని సండ్ర వీరయ్య చెప్పారు. అవకాశాల కోసం రాజకీయంగా కుట్రపూరితంగా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్నీ వదిలేసి ప్రజలకోసం పనిచేస్తున్నామని చెప్పారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించే విధంగా పని చేస్తోందని చెప్పారు.
ఉపాధి హామీలో కోత పెట్టి బీజేపీ సర్కారు కూలీల కడుపుకొడుతోందని అన్నారు. ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. యావత్ తెలంగాణలో వైద్య రంగం గొప్పగా పనిచేస్తోందని అన్నారు. దళారులు ఇళ్లు ఇప్పిస్తానని చెప్తే మోసపోవద్దని తెలిపారు. ఒకేసారి ఇళ్ల సమస్య పరిష్కారం కాదని, విడతల వారీగా ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
పార్టీలు చూసి చెక్ లు ఇవ్వటం లేదని, నవతా దృక్పథంతో పేదవారికి అండగా ఉంటున్నామని అన్నారు. అవకాశవాదం కోసం,ఓట్ల కోసమో ప్రభుత్వం పని చేయటం లేదని చెప్పారు. కులానికో, మతానికో వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదని అన్నారు. రోడ్లు వేసేందుకు స్వేచ్ఛగా టెండర్లు పిలిచామని, నియోజకవర్గంలో గుంతలు లేకుండా రోడ్లు వేసుకున్నామని తెలిపారు.