Peddapalli Dist : ఫొటో చిన్నదిగా ఉందంటూ ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు అభిమానుల ఆందోళన

వేదిక మీదకు వెళ్లి.. ఇంత చిన్నదిగా ఫొటో పెడుతారా ? అంటూ ఆ ప్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకున్నారు. అభిమానుల ఆందోళనపై అసహనం..

Mlc Bhanu Prasad Rao

MLC Bhanu Prasad Rao Fans: పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో రసాభాస నెలకొంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై గొడవ జరిగింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఫొటో చిన్నగా పెట్టడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత ముందు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అభిమానులు ఆందోళనకు దిగారు. అందరి ఫోటోలు పెద్దదిగా పెట్టి… తన నేత ఫొటో చిన్నగా పెట్టడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..భానుప్రసాద వర్గీయులు వాగ్వాదానికి దిగారు. చిన్న వాగ్వాదం కాస్త పెద్దదిగా మారుతున్న తరుణంలో ఆందోళనకారులను స్టేజ్‌ పైనుంచి కిందకు తీసుకెళ్లారు పోలీసులు. పెద్దపల్లిలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది.

Read More : Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

వేదిక మీదకు వెళ్లి.. ఇంత చిన్నదిగా ఫొటో పెడుతారా ? అంటూ ఆ ప్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకున్నారు. అభిమానుల ఆందోళనపై అసహనం వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వారిని ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భానుప్రసాద రావు ఫొటోకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.