గృహలక్ష్మీ పథకం ప్రారంభించడానికి ఆమెను ఏ హోదాలో పిలుస్తారు? మేము కచ్చితంగా నిరసన తెలుపుతాం

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తామని అన్నారు.

MLC Kavitha

BRS Leader Kavitha : ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేశారు.. సాయంత్రం పార్టీ మీటింగ్ పెట్టారు.. నిన్నటి మీటింగ్ కు పెట్టిన ఖర్చు ఎంత? ప్రభుత్వ ఖర్చుతో పార్టీ సభ ఎలా నిర్వమిస్తారు? అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. సీఎం మలివిడత అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మీ పథకం ప్రారంభించడానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. ఆమె ప్రభుత్వ పరంగా ఏ పదవిలో లేరు.. ప్రభుత్వ కార్యక్రమానికి ఆమెను ఎలా పిలుస్తారు? మేము ఖచ్చితంగా నిరసన తెలుపుతామని కవిత అన్నారు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఇక్కడ పెట్టడం, సీఎం ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తాం.. రేవంత్ ను యూటర్న్ ముఖ్యమంత్రి అని అంటారు.. చెప్పింది ఒకటి.. చేస్తుంది ఒకటి అంటూ కవిత విమర్శించారు.

Also Read : వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పులుచేర్పులపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

కుటుంబ పాలన అంటూ మాపై విమర్శలు చేశారు.. మరి మీ సోదరులు ఏం చేస్తున్నారో సమయం వచ్చినప్పుడు బయటపెడతాం అంటూ కవిత రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చింది.. మీ పార్టీలో ఇన్ని వారసత్వ కుటుంబాలు ఉన్నాయి.. మరి మీది కుటుంబ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం నోటి నుంచి జై తెలంగాణా అన్నమాట రాలేదు.. అమరవీరులకు జోహార్లు అర్పించే సమయం ఆయనకు లేదు.. ప్రజలు అంతా గమనిస్తున్నారని కవిత హెచ్చరించారు.

Also Read : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

నేను మా ప్రభుత్వంలో పూలే విగ్రహం గురించి అడగలేదు.. మీరు విగ్రహం పెడతారా? పెట్టరా? స్పష్టత ఇవ్వాలని కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటే కుల గణన జరగాలని కవిత అన్నారు. బీసీలకు 20వేలకోట్ల బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. సీఎం నోరు మెదపడం లేదని కవిత విమర్శించారు. కొత్త నియామకాల్లో బీసీ, ఎస్సీల వాటా ఎంత ఉందో తెలుస్తోందని అన్నారు. బీసీలకు ఇక్కడ ప్రాధాన్యత దక్కకుండా పోయిందని కవిత అన్నారు.