TDP Leader Buddha Venkanna : వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పులుచేర్పులపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..
కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు.. అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారని అన్నారు.

Buddha Venkanna
Buddha Venkanna : వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పులుచేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారని, మాటలు ఇచ్చాక సీట్లలో మార్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒకసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అవుతుందని బుద్దా వెకన్న వ్యాఖ్యానించారు.
Also Read : కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం గడల శ్రీనివాసరావు ప్రయత్నాలు
కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు.. అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారని అన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు.. టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరు దగ్గర అప్పులు చేశాడు. కేశినేని నానికి అప్పు ఇవ్వడమంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదేనని బుద్దా విమర్శించారు. మైలవరం వైసీపీ ఇంఛార్జిగా ఉండికూడా డబ్బులు కొట్టేసి ఉంటాడని బుద్దా వెంకన్న ఆరోపించారు.
Also Read : BRS Leader Rajaiah : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
కేశినేని నానిని రోడ్లమీదకు వదిలేటప్పుడు ఆయన అప్పులను జగనే తీర్చాలి.. అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళ్తే అప్పుల వాళ్లు నాని వెంట ఉంటారంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చాల్సి వస్తుందనే నాని పార్టీ మారారని బుద్దా ఆరోపించారు. కేశినేని నాని వెనుక టీడీపీ నేతలే కాదు.. ఆయన ఫ్యామిలీ కూడా లేదు. కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వడంకూడా డౌటే అంటూ ఎద్దేవా చేశారు. ఆయన విశ్వాసంలేని కుక్క.. చంద్రబాబుపై లేనిపోని నిందలేస్తూ మొరుగుతున్నాడు. మొన్నటి వరకు కొడాలి నాని.. ఇప్పుడు కేశినేని నాని మొరుగుతున్నారు.. కేశినేని నాని సత్య హరిశ్చంద్రుడైనట్లు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాతున్నారు.. చంద్రబాబు టికెట్లు అమ్మకుకుంటున్నారని కేశినేని నాని చెప్పేశాడని పెద్దిరెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నారు.. జగన్ లాంటి నీచనికృష్ణ సీఎంను చూడలేదని కేశినేని నాని కామెంట్ చేశారు.. అది నిజమైతే.. ఇదీ నిజమే అంటూ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.