వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

Thatikonda Rajaiah

Updated On : February 3, 2024 / 11:37 AM IST

Thatikonda Rajaiah :  ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే అనుచరులతో భేటీ  అయిన అయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10న భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో రాజయ్య చేరుతారని సమాచారం. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు, ఆ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీతోపాటు సీఎం రేవంత్ రెడ్డినికూడా రాజయ్య కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంసైతం రాజయ్య చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లబోతున్నట్లు తెలిసింది.

Also Read : కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం గడల శ్రీనివాసరావు ప్రయత్నాలు

గత ఎన్నికల సమయంలో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు బీఆర్ఎస్ అదిష్టానం టికెట్ ఇవ్వలేదు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని రంగంలోకి దింపింది. ఆ సమయంలో వరంగల్ ఎంపీ స్థానానికి పోటీచేసేలా అవకాశం కల్పిస్తామని రాజయ్యకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ ఎంపీ సీటు రాజయ్యకు దక్కే అవకాశం కనిపించక పోవటంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

 

కాంగ్రెస్ పార్టీలో చేరికపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య 10టీవీతో మాట్లాడారు.. గత ఆరు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురయ్యా.. నాకు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు లేదు. మాదిగ అస్తిత్వంపై, ఆత్మగౌరవంపై దెబ్బపడుతుందనే భావన నాలో కలిగింది.. కాబట్టే బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు రాజయ్య తెలిపారు. నా అనుచరులు, మాదిగ నాయకత్వంతో మాట్లాడి త్వరలో నా నిర్ణయాన్ని వెల్లడిస్తానని రాజయ్య చెప్పారు. నాకు కాంగ్రెస్ నేతలతో పరిచయాలున్న మాట వాస్తవం.. అయితే, నా అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్ లో చేరికపై నా నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.