Khammam : ఖమ్మంలో విషాద ఘటన.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
Khammam : ఖమ్మం జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు యత్నించింది.
khammam tragedy Incident
Khammam : ఖమ్మం జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు యత్నించింది. ఇద్దరు కుమారులు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో డివిజన్ గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి ఇద్దరు దంపతులు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ (7), తనుష్ (5) ఉన్నారు. గత కొన్నినెలలుగా వీరు కుటుంబ పోషణ నిమిత్తం ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని గాంధీ నగర్లో నివాసం ఉంటున్నారు.
Also Read : Indian Railways : రైలు ప్రయాణికులకు షాక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.. ఇకపై వారి జేబులకు చిల్లు
లింగరాజు పాల వ్యాపారంతోపాటు త్రీటౌన్ ప్రాంతంలో ఓ సెల్‌ఫోన్ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో భార్య, భర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్వాతి తన ఇద్దరు పిల్లలకు చాక్లేట్లో ఎలుకల మందు కలిపి తినిపించి. భర్తకు ఫోన్ చేసి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది.. త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. లింగరాజు సిరప్ తీసుకొనివెళ్లి పిల్లలకు తాపించాడు. తర్వాత పిల్లలిద్దర్నీ పడుకోబెట్టాడు.. పెద్ద కుమారుడు వేదక్ కుమార్ నిద్రలోనే కన్నుమూశాడు. చిన్న కుమారుడికి వాంతులు కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు.
స్వాతీ సైతం ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. ప్రస్తుతం నగరంలో ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో స్వాతి చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల మృత దేహాలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
