MP Anil Yadav: రాహుల్ గాంధీ బర్త్‌డే.. 100 కంపెనీలతో ‘భారీ ఉద్యోగ మేళా’.. యువతకు ఎంపీ అనిల్ యాదవ్ పిలుపు
రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న గాంధీ భవన్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్(AP Anil Yadav) తెలిపారు.
Mp anil yadav announces mega job mela at gandhi bhavan on rahul gandhi birthday
- గాంధీ భవన్లో మెగా జాబ్ మేళా
- 100 కంపెనీలు పాల్గొంటున్నాయి
- మోడీ, కేటీఆర్‌పై విమర్శలు
MP Anil Yadav: రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న గాంధీ భవన్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Yadav) తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 100కు పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని అనిల్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో జరిగిన పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు.
అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అలాగే దేశ అభివృద్ధికి కృషి చేసిన ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, రాజీవ్ గాంధీ, నరసింహ రావుల కృషిని విస్మరించి రాజకీయ ప్రచారానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. అలాగే కేటీఆర్ కుటుంబంపై కూడా వ్యాఖ్యలు చేస్తూ, వెన్నుపోటు రాజకీయాల గురించి ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
