Mulugu Siddanthi: ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు.

Mulugu Siddanthi: ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూత

Mulugu

Updated On : January 23, 2022 / 9:02 PM IST

Mulugu Siddanthi:  ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. టీవీల్లో కార్యక్రమాల ద్వారా జ్యోతిష్య శాస్త్రం గురించి వివరిస్తూ.. ప్రఖ్యాతిగాంచిన జ్యోత్యిష్య పండిత నిపుణులు, ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతికి ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బంది రాగా.. కుటుంబ స‌భ్యులు పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుప‌త్రికి తరలించారు.

ఆసుప‌త్రికి చేరుకునేలోపే సిద్ధాంతి మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గత 30 సంవత్సరాల నుంచి తన జ్యోతిష్య శాస్త్రంలో ప్రఖ్యాతిగాంచారు.

జ్యోతిష్యంలో ప్రతి అంశంలోనూ పట్టు సాధించిన సిద్ధాంతి.. శాస్త్రీయ పద్ధతులు, వాస్తు గురించి పరిపూర్ణంగా వివరించేవారు. ములుగు చెప్పిన అంచనాలు దాదాపుగా నిజమవుతాయనే నమ్మకం కొంతమంది ప్రజల్లో ఉంది. గత 14 సంవత్సరాల నుంచి తెలుగు న్యూస్ పేపర్ వార్తల్లో ఆయన జోతిష్యం ప్రచురింపబడుతోంది.