ముంబై ఆస్పత్రుల్లో నిండిపోయిన పడకలు.. కరోనా పేషెంట్ల పాట్లు!

ముంబై నగరంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ముంబై ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించేందుకు పడకలు అందుబాటులో లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా కొవిడ్-19 తీవ్ర అనారోగ్య బాధితులకు పడకల కొరత ఏర్పడింది. దాంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్ (1916)కు పేషెంట్ల బంధువులు బెడ్స్ రిజిస్టర్ కోసం కాల్ చేస్తున్నారు. వెయిట్ లిస్టులో చాలామంది ఉండటంతో పడకలు ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తున్నారు.
పడకల కొరత తీవ్రంగా ఉండటంతో బీఎంసీ ముంబైలోని పలు ఆస్పత్రుల్లో మరిన్ని పడకలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా పేషెంట్ల కోసం నాయర్ ఆస్పత్రి, కెఈఎం ఆస్పత్రి, సియోన్, సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో పడకలను ఏర్పాటు చేసింది. అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పడకలను ఏర్పాటు చేస్తోంది. ముంబై నగరంలో సోమవారం రాత్రి వరకు కొవిడ్-19 కేసులు 14,251 వరకు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 10,883 వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం.. మూడు శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉండగా, 27శాతం మంది కరోనా లక్షణాలు లేని కేసులే ఎక్కువగా ఉన్నాయి.
బీఎంసీ మార్గదర్శకాల ప్రకారం.. తీవ్ర అనారోగ్యంతో పాటు కొన్ని ఇతర కేసుల్లో మాత్రమే ఆస్పత్రికి తరలించడం తప్పనిసరిగా చేసింది. అందులో లక్షణాలు కనిపించని వారికి కూడా అవకాశం ఉంది. ఇప్పటివరూ 10,883 కరోనా కేసుల్లో 3,200 మంది లక్షణాలు లేనివారు లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారే ఉన్నారు. కొవిడ్-19 ఆస్పత్రుల్లో మాత్రం తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ల కోసం 4,750 పడకలు అందుబాటులో ఉన్నాయి. మే మొదటి వారంలోనే 1,750 పడకలను ఏర్పాటు చేయగా.. ఇంకా పడకల కొరత ఎదురవుతూనే ఉంది.
Read More:
* కరోనా గొడుగు మన చుట్టూ రక్షణ కవచం
* 80ఏళ్లు దాటితే విమానాల్లోకి నో ఎంట్రీ, ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే..