కరోనా గొడుగు మన చుట్టూ రక్షణ కవచం

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 06:56 AM IST
కరోనా గొడుగు మన చుట్టూ రక్షణ కవచం

కరోనా రాకాసి ఎప్పుడు పోతుందోనని ఎదురు చూస్తున్నారు జనాలు. ఎంతోమందిని బలి తీసుకుంటున్న ఈ వైరస్ కు ఇప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ మూడుసార్లు కొనసాగించారు. వైరస్ వల్ల సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పశ్చిమ సియాంగ్ లోని బ్యాంకు ఎదుట చేసిన ఏర్పాట్లు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడకు వచ్చే కస్టమర్లు భౌతిక దూరం పాటించే విధంగా గొడుగులు ఏర్పాటు చేశారు. ఐదు అడుగుల ఎత్తులో..దూరం..దూరంగా..గొడుగులు ఏర్పాటు చేయడం వల్ల భౌతికదూరం పక్కాగా అమలు చేస్తున్నట్లవుతోంది. 

ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఉండాలంటే గొడుగులు చక్కగా ఉపయోగ పడుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన భౌతిక దూరానికి సరిగ్గా సరిపోతుందంటున్నారు. ఇందులో భాగంగా..ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని, ఈ క్రమంలో ప్రతొక్కరూ గొడుగు వాడితే బెటర్ అని సూచిస్తున్నారు. దీనివల్ల ఒక మీటర్ పాటించే అవకాశం ఉంటుందంటున్నారు. గొడుగే మన చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. 

Read Here>> 40 శాతం తగ్గిన వ్యర్ధాలు..లాక్ డౌన్ మంచే చేసిందిగా..