Muzigal: మణికొండలో అత్యాధునిక మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
భారతదేశంతో పాటుగా యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి

Manikonda: ముజిగల్ తమ 6వ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లోని మణికొండలో ప్రారంభించింది. ఇది గాత్రం, వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైందని మ్యూజిగల్ యాజమాన్యం చెప్పింది. దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన మణికొండలోని ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్, వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు.
ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు. సంగీత అభ్యాసంలో సమగ్రమైన కార్యాచరణ అందించడం ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రూపాలలో బోధనతో సంగీత విద్యలో అత్యున్నత ప్రమాణాలను ముజిగల్ అత్యాధునిక అకాడమీ ఏర్పరిచింది. ఇదే కేంద్రంలో సంగీత పరికరాలను సైతం విక్రయాలకు అందుబాటులో ఉంచారు.
భారతదేశంతో పాటుగా యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ముజిగల్, అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన అంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్నా లేదా ట్రినిటీ గ్రేడ్ సర్టిఫికేషన్ కోసం తీవ్రంగా శ్రమించే వారైనా, విద్యార్థుల ఆశలను ఇది నెరవేరుస్తుందని అన్నారు.