BJP MLC Candidate : ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
నల్గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.

Premender Reddy
Telangana Graduation BJP MLC Candidate : నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. చివరకు గత గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రేమేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ప్రేమేందర్ రెడ్డి రేపు ఉదయం 11గంటలకు నల్గొండలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also Read : PM Modi : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. కోడె మొక్కులు చెల్లింపు
నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Also Read : తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి.. సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది : ప్రధాని మోదీ
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో విజయం సాధించారు. అయితే, గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జనగామ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత తన ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ మే 28వ తేదీని ప్రకటించింది.