కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఒక్కో షిప్ట్ లో 900 మంది..

మొదట 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేసే ప్రక్రియను

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఒక్కో షిప్ట్ లో 900 మంది..

Graduate MLC Bypoll Counting

Updated On : June 5, 2024 / 10:23 AM IST

Graduate MLC Bypoll Counting : వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్ధిగా రాకేశ్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ బరిలో నిలిచారు. వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలింగ్ 72.44శాతం న‌మోదైన విష‌యం తెలిసిందే. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా.. 3,36,013 ఓట్లు నమోదయ్యాయి. నల్గొండ లోని దుప్పలపల్లి వేర్ హోసింగ్ గౌడన్స్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏకదాటిగా 24 గంటల పాటు కౌంటింగ్ కొనసాగనుంది.

Also Read : కూటమి అధికారంలోకి.. సెలవుపై విదేశాలకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

మొదట 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేసే ప్రక్రియను కౌంటింగ్ సిబ్బంది మొదలు పెట్టనున్నారు. చెల్లుబాటైన ఓట్ల లెక్కింపులో సగంకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు మార్క్ గా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు మార్క్ ను ఎవరు రీచ్ కాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అభ్యర్ధులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌంటింగ్ జరగనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే ఫలితం రేపు వెలువడే అవకాశం ఉంది.

Also Read : లోక్‌సభ ఫలితాల తర్వాత.. నితీశ్ కుమార్‌పై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మీమ్స్.. ఎందుకంటే?

నల్గొండలోని వేర్ హౌసింగ్ గౌడన్స్ లో నాలుగు హాల్స్ లో మెత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపే లెక్కింపు జరపనున్నారు. 24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేలా షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది. ఒక్కో షిప్ట్ లో 900 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం మూడు వేల మంది సిబ్బంది ఎమ్మెల్సీ బ్యాలెట్ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు.