Shilpa Chowdary : శిల్ప డ్రామాలు..ఏడుపులు..గంటకో నాటకం
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిల్పా చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు...

Shilpa Chowdary
Narsingi Police Shilpa Chowdary : ఏడుపులు.. డ్రామాలు.. గంటకో నాటకం ఇలా సాగుతోంది మాయలేడి శిల్పాచౌదరి విచారణ. తెలుగు రాష్ట్రాల్లో జనాల్ని మోసం చేసి, కోట్లు కొట్టేసిన మాయలేడి శిల్పాచౌదరి విచారణ సమయంలో పోలీసులతో నీళ్లు తాగిస్తోంది. రెండ్రోజుల కస్టడీలో భాగంగా.. శిల్పాచౌదరిని మొదటి రోజు సుమారు ఏడు గంటల పాటు విచారించిన పోలీసులు.. కీలక విషయాలనే రాబట్టినట్లు తెలుస్తోంది. 2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కస్టడీలో పోలీసు విచారణ ప్రారంభంకాగానే.. శిల్పాచౌదరి సమాధానాలు చెప్పేందుకు మొండికేసింది. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బినామీ లెక్కలపై వేసిన ప్రశ్నలకు ఆమె నోరే విప్పలేదని సమాచారం. కానీ రిజిస్ట్రర్ అయిన కేసులు, కాల్‌డేటా సహా ఇతర ఆధారాలను కళ్లముందు ఉంచగానే వెనక్కి తగ్గింది.
Read More : Omicron India : ఒమిక్రాన్ కట్టడికి..కర్నాటక సర్కార్ చేస్తున్న వ్యూహాలేంటీ ?
ఆ తర్వాత శిల్పాచౌదరి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ప్రముఖులు వారి బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు పెట్టుబడులు పెట్టారని పోలీసులకు చెప్పింది. చాలా మంది తనకు డబ్బు అప్పుగా ఇచ్చారని.. కొంతమంది తన వద్ద పెట్టుబడులు పెట్టినట్లు పోలీసుల ముందు శిల్పా చౌదరి చెప్పినట్లు సమాచారం. తొలి రోజు కస్టడీలో మొదట కాసేపు డ్రామాలాడిన శిల్పాచౌదరి… విచారణకు ఏమాత్రం పోలీసులకు సహకరించలేదని సమాచారం. విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. మొదట నాకేం తెలియదంటూ గట్టిగా మాట్లాడింది శిల్పా చౌదరి. ఆ తర్వాత పోలీసులు ఆధారాలు చూపించడంతో బోరున ఏడ్చినట్లు సమాచారం. గడియకోసారి తల నొప్పి, కళ్లు తిరుగుతున్నాయంటూ.. ఏదో ఒక వంక చెప్తూ కస్టడీ సమయాన్ని వృథా చేసింది. దీంతో అసలు ఎలా నిజాలు రాబట్టాలన్న దానిపై పోలీసులు ఆలోచిస్తున్నారు.
Read More : Omicron: హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు.. వైరస్ హాట్‌స్పాట్‌లు గుర్తింపు
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిల్పా చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు.. శిల్పా చౌదరి వాంగ్మూలం నమోదు చేశారు. శిల్పా ఫోన్‌కాల్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు కొందరిని విచారించారు. కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించిందనే కోణంలోనూ పోలీసులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు శిల్పాచౌదరిపై ఇప్పటివరకూ పోలీసులకు అధికారికంగా వస్తున్న కేసుల కంటే తమ డబ్బు ఇప్పించండి మహప్రభో అంటూ వస్తున్న ఫోన్‌కాల్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇవాళ మరోసారి నార్సింగి పోలీసులు శిల్పాచౌదరిని విచారించనున్నారు. ఎలాగైనా ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.