Netizen asked KTR: కేటీఆర్ గారూ.. నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటారా..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అదుపుచేయడానికి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులిస్తూ మిగిలిన వారికి నో చెప్పేశారు.

Ask Ktr
Netizen asked KTR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అదుపుచేయడానికి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులిస్తూ మిగిలిన వారికి నో చెప్పేశారు. ప్రత్యేక అవసరాలు ఉంటే మాత్రమే ఈ పాస్ కు అప్లై చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ క్రమంలో తన పెళ్లి కోసం తండ్రికి ఈ పాస్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ఓ వ్యక్తికి షాకింగ్ రెస్పాన్స్ వచ్చిందట. తన తండ్రికి ఈ పాస్ ఇవ్వడం కుదరదని.. కేవలం ఫ్యామిలీకి మాత్రమే అనుమతిస్తామని చెప్పారట. దాంతో ఆ వ్యక్తి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను ప్రశ్నిస్తూ.. పోస్టు పెట్టాడు.
The great @RachakondaCop has rejected epass application for my own father to attend my marriage. Saying a reason only family is allowed. Isn't my father my blood relative.@KTRTRS would you get married without your father #KCR?
— srinu (@srinu2100) June 1, 2021
‘గ్రేట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ నా పెళ్లికి అటెండ్ అవ్వాలని మా నాన్న ఈ పాస్ అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు. కేవలం ఫ్యామిలీ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నా తండ్రి అంటే నా రక్త సంబంధం కాదా.. కేటీఆర్ గారూ.. తండ్రి లేకుండా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించాడు.
దీనిపై స్పందించిన రాచకొండ పోలీస్.. రిఫరెన్స్ ఐడీ అడిగి విచారణ జరిపి ఈ పాస్ అప్రూవ్ చేయించారు. సదరు నెటిజన్ కు అదే విషయాన్ని రీట్వీట్ చేసి తెలియజేశారు.