Nalgonda Crime : పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకొని.. మూడు నెలలకే ఆత్మహత్య
వరకట్న వేధింపులు తాళలేక మరో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే నవవధువు చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది

Nalgonda Crime
Nalgonda Crime : వరకట్న వేధింపులు తాళలేక మరో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డిండి మండలం వావిల్‌కొల్ గ్రామానికి చెందిన మబ్బు అలెమ్మ, చిన్న నాగయ్య కుమార్తె శ్రీలత(24), అదే గ్రామానికి చెందిన జుట్టు బొజ్జమ్మ, మొగిలయ్య కుమారుడు చిన్నయ్య ఏదాది కాలం నుంచి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో ఎదిరించిమరీ వివాహం చేసుకున్నారు.
చదవండి : Nalgonda : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
భార్యాభర్తలు గ్రామంలో కిరణం కొట్టు నడుపుతున్నారు. పెళ్లైన నెల రోజులకే భర్త చిన్నయ్య వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. కట్నం తేవాలని ఆమెను మానసికంగా హింసించడంతో అటు పుట్టింటి వెళ్లలేక ఇటు భర్త వేధింపులు తట్టుకోలేక గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుంది. అయితే, అనుమానంతో కుటుంబ సభ్యులు వెతకగా అప్పటికే విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
చదవండి : Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తింటి వేధింపులతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి సోదురుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పోచయ్య తెలిపారు.