పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను చంపిన నిందితుడు రియాజ్‌ను ప్రాణాలతో పట్టుకున్నాం.. స్పష్టతనిచ్చిన నిజామాబాద్ సీపీ.. ఏం జరిగిందంటే?
రియాజ్ దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో అతడిని చంపేసినట్లు ముందుగా ప్రచారం జరిగింది.

Nizamabad Constable: నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. సారంగాపూర్ ప్రాంతంలో జనకంపేట రహదారిపై ఫేమస్ దాబా ఎదుట రియాజ్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి అక్కడకు వెళ్లారు. అతడిని పట్టుకునే క్రమంలో రియాజ్ ప్రతిఘటించాడు.
Also Read: KTR: మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తాం: స్పష్టం చేసిన కేటీఆర్
అతడి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేయబోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌లో రియాజ్‌ను హతమార్చినట్లు జరుగుతోన్న ప్రచారంపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య స్పష్టత ఇచ్చారు.
నిజామాబాద్‌లో ఎలాంటి ఎన్‌కౌంటర్ జరగలేదని తెలిపారు. నిందితుడు రియాజ్‌పై కాల్పులు జరపలేదని అన్నారు. కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ను ప్రాణాలతో పట్టుకున్నామని తెలిపారు. వైద్య పరీక్షల కోసం రియాజ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ప్రమోద్ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ముందే కానిస్టేబుల్‌ను చంపిన నిందితుడు రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ చాలా మంది నుంచి వచ్చింది. నిందితుడు రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కూడా అన్నారు.