Paddy Issue : హస్తినకు గులాబీ దండు.. తెలంగాణ భవన్ వద్ద దీక్ష

విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...

Delhi Telangana Bhavan : కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనిపించేందుకు గులాబీ దండు హస్తినకు కదులుతోంది. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌ వేదికగా నిర్వహించనున్న దీక్షకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరళి వెళ్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకొన్నారు. మిగిలినవారంతా ఆదివారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకొనేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తోపాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు.

Read More : Bandi Sanjay Open Letter : టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ తదితరులు దీక్షా వేదిక ఏర్పాటు పనులను పరిశీలించారు. దీక్షలో పాల్గొనేవారికి ఏ ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు నేతలు. వేదిక, పార్కింగ్‌, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షా స్థలికి చేరుకొనేందుకు వాహనాల ఏర్పాటుతో పాటు తదితర పనులకు ఉప కమిటీలు నియమించారు.

Read More : MLA Jeevan Reddy : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు. తెలంగాణ నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రైతులను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు