Kishan Reddy On Paddy : అప్పుడు మీటర్లు, ఇప్పుడు వడ్లు.. టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్న కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వడ్ల సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని..

Kishan Reddy On Paddy : టీఆర్ఎస్, బీజేపీ మధ్య ధాన్యం దంగల్ తారస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. పోటాపోటీ దీక్షలు, ఆందోళనలతో రాజకీయాలను వేడెక్కించారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి, చేస్తున్న వితండవాదం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చాలా విచిత్రంగా ఉందన్నారాయన.

హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని చెప్పి ఉద్యమానికి పిలుపిచ్చారని, మీటర్ల పేరుతో నానా హంగామా చేశారని టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. అయితే, దీనిపై ఇప్పటివరకు కేంద్రం జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదన్నారు. దీన్ని రైతులు అర్ధం చేసుకున్నారని చెప్పారు. దీంతో టీఆర్ఎస్ ధర్నాకు స్పందన కరువైందన్నారు. ప్రస్తుతం వడ్ల సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి ఉప్పుడు బియ్యం పంపమని రాష్ట్రమే ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు.(Kishan Reddy On Paddy)

Bandi Sanjay Kumar: రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల డబ్బు ద్వారా కొంటున్న ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఎక్కడా ఉప్పుడు బియ్యం వినియోగంలో లేదన్నారు కిషన్ రెడ్డి. గత మూడు నాలుగేళ్లుగా బాయిల్డ్ రైస్ వద్దని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆయన వివరించారు.

కాగా, తెలంగాణలో గురువారం నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారులతో సమావేశమైన బండి సంజయ్ యాత్ర గురించి వారితో చర్చించారు.

Palla rajeshwar reddy on paddy : దమ్ముంటే ధాన్యం కొనిపించండి.. తెలంగాణ బీజేపీ నేతలపై పల్లా ఫైర్..

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. రైతుల ముసుగులో మాపై దాడులు చేయించి, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడినైనా భరించేందు తాము సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Singireddy Nirajan reddy : చెమటోడ్చి కష్టపడడమే కాదు.. కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసు

ట్రెండింగ్ వార్తలు