Nirajan reddy : చెమటోడ్చి కష్టపడడమే కాదు.. కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసు

యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, రైతులకు చెమటొడ్చి కష్టపడమే కాదు.. సమయం వచ్చినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టించడం ..

Nirajan reddy : చెమటోడ్చి కష్టపడడమే కాదు.. కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసు

Niranjan Reddy

Nirajan reddy : యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, రైతులకు చెమటొడ్చి కష్టపడమే కాదు.. సమయం వచ్చినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా తెలుసని గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో దీక్ష చేపట్టింది.

Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

ఈ దీక్షా శిబిరంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. లాభ నష్టాల దృష్టితో ఆలోచించడానికి వ్యాపార సంస్థ కాదన్నారు. ఇటీవల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడితే ప్రధాని క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్రానికి సమభావన లేదని, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలకు కనీస మద్దతు ధర, పంటకు సేకరణ పై చేసిన డిమాండ్ ఇప్పుడు ఆయనే పాటించడం లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు.

Paddy Issue : హస్తినకు గులాబీ దండు.. తెలంగాణ భవన్ వద్ద దీక్ష

యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర మంత్రితో చర్చలకు వెళ్తే అవమానించేలా మాట్లాడుతున్నారని, నూకల బియ్యం మీ ప్రజలకు పెట్టండి అంటూ అవహేళన చేశారని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదని, చెమటోడ్చి కష్టపడ్డ తెలంగాణ రైతులు పంజాబ్‌ను తలదన్నేలా పంట దిగుబడి సాధించారని, ఇది గర్వించాల్సిన విషయమన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. కేవలం కొనే విషయంలోనే బాధ్యత కలిగిన కేంద్రం, ఆ పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతులకు చెమటోడ్చి కష్టపడడమే కాదని, కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా తెలుసన్నారు.