Ktr On Paddy Procurement
KTR On Paddy Procurement : తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం దంగల్ కొనసాగుతోంది. తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. నమ్మించి మోసం చేశారని మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు.
” కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోదీ ఆనాడు ట్వీట్ పెట్టారు. రోడ్లు ఎక్కి ఆందోళన చేశారు. మన్మోహన్ సింగ్ కు పాలన చేతకావడం లేదు. దిగిపొమ్మని మోదీ మాట్లాడారు. ఇప్పుడేమో ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారు. వరిని గతంలో కొన్నట్లు కొనమని కేంద్రాన్ని కోరాం. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదన్నారు. మీ ప్రజలకు నూకలు తినిపియ్యడం నేర్పించాలని అవమనించారు.(KTR On Paddy Procurement)
Minister KTR Fires On BJP : బీజేపీని గద్దె దించే వరకు వదిలిపెట్టం : మంత్రి కేటీఆర్
ఉప్పుడు బియ్యం దేశం నుంచి కోటి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రపంచ డేశాలకు ఎగుమతి చేస్తోంది. పీయూష్ గోయల్ సిగ్గు లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. సీజన్ మొదట్లోనే వరి పంట వేయొద్దని మేము చెప్పాం. బండి సంజయ్ ఢిల్లీలో పరపతి ఉన్నట్లు వరి వేయండి మేము కొనిపిస్తాం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బాయిల్ రైస్, రా రైస్ అయినా కొంటారని చెప్పారు. నమ్మించి మోసం చేసే బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని చెప్పినా వినకుండా కొందరు వరి వేశారు.
తెలంగాణలో బీజేపీ నాయకుల హడావుడితో రైతులు ఆగమాగం అయి 35వేల ఎకరాల్లో వరి వేశారు. అచ్చేదిన్ దివస్ రోజు పార్లమెంటులో పీయాష్ గోయల్ వడ్లు కొనమని చెప్పారు. ఢిల్లీ బీజేపీ ఒక మాట చెబుతుంది, సిల్లీ బీజేపీ ఇంకొకటి చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దాం. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి. ప్రతి ఊరిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలి” అని పిలుపునిచ్చారు కేటీఆర్.
మరోవైపు గవర్నర్ తమిలిసై వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. తనకు తానే ఊహించుకుంటే మేమేం చేయాలి అన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో ఇబ్బంది పెట్టినందుకు తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అనడం కరెక్ట్ కాదన్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు మాకు ఎప్పుడూ ఇబ్బంది కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.