TRS Protests: ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు

TRS Protests: ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

Trs

TRS Protests: తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రంమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ..టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్త్ర వ్యాప్త నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసిన టీఆర్ఎస్ నేతలు..గురువారం జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల మద్దతుతో నిర్వహించే ఈ నిరసనల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొంటున్నారు.

Also read:AP Cabinet : ఏపీ కేబినెట్‌కు కౌంట్‌డౌన్.. కొత్తమంత్రివర్గంలో ఎవరెవరికి చోటు.. తేలేది నేడే..!

వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలో నిర్వహించే నిరసనల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొననున్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటించనున్నారు. కేంద్రం ప్రభుత్వం వరి ధాన్యం కొనాలని చేపడుతున్న నిరసనల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించనున్న నిరసన దీక్షలో మంత్రి కేటిఆర్ పాల్గొంటారు. ఈ నిరసనల్లో స్థానిక ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్ బాబు, సుంకెరవిశంకర్, రసమయి బాలకిషన్ లు కూడా పాల్గొననున్నారు. మిగతా జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నిరసన చేపట్టనున్నారు.

Also read:Telangana Corona Case Report : తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు