Papannapet Mandal : ఊరికి పుట్టిన రోజు.. కేక్ కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు

సంక్రాంతి పండగ రోజు కేక్ కట్‌ చేసి సంబరాలు జరుపుకోవడం వారికి ఆనవాయితీగా మారింది. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని...

Papannapet Mandal : ఊరికి పుట్టిన రోజు.. కేక్ కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు

Papannapet

Updated On : January 16, 2022 / 4:17 PM IST

Papannapet Mandal Laxmi Nagar : ఇప్పటివరకు మనం మనుషులు పుట్టిన రోజులు, పెంపుడు జంతువుల పుట్టిన రోజులు చేసుకోవడం చూశాం. కానీ ఓ ఊరికి పుట్టిన రోజు చేయడం ఎప్పుడైనా చూశారా? మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ ప్రజలు మాత్రం తమ ఊరి పుట్టిన రోజును గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ ఊరి 74వ పుట్టిన రోజును పండగ వాతావరణంలో జరుపుకున్నారు. గ్రామస్తులంతా కలిసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి రోజున ఊరి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు గ్రామస్తులు.

Read More : Vinod Kumar : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు : వినోద్ కుమార్

సరిగ్గా డెబ్భై నాలుగేళ్ల క్రితం 14 కుటుంబాలతో లక్ష్మీ నగర్‌ గ్రామం ఏర్పడింది. 2014లో లక్ష్మీ నగర్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు… ఊరిని అభివృద్ధి చేసుకున్నారు. 2016 నుంచి గ్రామం ఏర్పడిన రోజును ఊరి పుట్టిన రోజుగా జరుపుకోవడం ప్రారంభించారు. ఊరి పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజులు గ్రామస్తులంతా కలిసి ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించుకుంటారు.

Read More : Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడుకాదయ్యో!

సంక్రాంతి పండగ రోజు కేక్ కట్‌ చేసి సంబరాలు జరుపుకోవడం వారికి ఆనవాయితీగా మారింది. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని ఎంజాయ్ చేస్తారు గ్రామస్తులు. ఎప్పటిలాగే ఈ సంక్రాంతి రోజు కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గ్రామస్తులు. ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ ఒక చోట చేరి… కేక్ కట్‌ చేసి విష్ చేసుకున్నారు. గ్రామ అభివృద్ధిపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు గ్రామ అభివృద్ధికి లక్ష రూపాయల నగదు అందించారు.