Patnam Narender Reddy: పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
లగచర్లలో గత నెల 11న అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.

Patnam Narender Reddy
వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఇటీవల తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
కింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలన్న నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అలాగే, మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. కాగా, లగచర్లలో గత నెల 11న అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 13న పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనలో కీలక నిందితుడు సురేశ్‌తో నరేందర్‌రెడ్డి అప్పట్లో మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Sukhbir Badal: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం