Sukhbir Badal: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద వీల్‌చైర్‌పై కూర్చున్నారు. బాదల్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరపబోయాడు.

Sukhbir Badal: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం

Updated On : December 4, 2024 / 10:57 AM IST

పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం చెలరేగింది. శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్, మాజీ ఉప మంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి కాల్పులు జరిపాడు.

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ లక్ష్యంగా అతడు కాల్పులు జరపబోగా, కొందరు నిందితుడిని అడ్డుకున్నారు. తుపాకీలో నుంచి గాల్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శిక్షలో భాగంగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద వీల్‌చైర్‌పై కూర్చున్నారు. బాదల్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరపబోయాడు. అతడిని బాదల్‌ అనుచరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితుడు గతంలో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ముఠాలో కొనసాగినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం