Traffic Lok Adalat : మార్చి 1 నుంచి వాహనాల పెండింగ్ చలానాల ఈ-లోక్ అదాలత్
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ (https://echallan.tspolice.gov.in/publicview) లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా

Traffic Lok Adalat
Traffic Lok Adalat : ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెండింగ్ చలానాలా ఈలోక్ అదాలత్ ఎల్లుండి… మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి ప్రకటన గతంలో 2, 3 సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయినా అప్పుడు పోలీసు శాఖ పెండింగ్ చలానాల లోక్ అదాలత్ చేపట్టలేదు.
ఇప్పడు ఇందుకు సంబంధించిన ఫైలు డీజీపీ కార్యాలయానికి చేరింది. ఇన్ చార్జి డీజీపీ ఆమోద ముద్ర వేయటమే తరువాయి. ఈలోక్ అదాలత్ కు అనుగుణంగా అధికారులు ఈచలానా పోర్టల్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. ద్విచక్రవాహనదారులు 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్ లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్ లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ (https://echallan.tspolice.gov.in/publicview) లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. పోర్టల్ అప్ డేట్ చేస్తున్నందున ప్రస్తుతం ఈ చలానా స్టేటస్ సేవలను నిలిపివేశారు. త్వరలో పోర్టల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.