Ranga Reddy District : రాజేంద్రనగర్‌లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Ranga Reddy District
Ranga Reddy District : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు. దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్టు చేసారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి కొన్ని ముఠాలు. వంటల్లో వాడే అల్లం పేస్ట్‌లో ప్రమాదకర కెమికల్స్ కలుపుతోంది ఓ ముఠా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఓసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. తాజగా మళ్లీ కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు.
Hyderabad Firing : హైదరాబాద్ మదీనాగూడలో ఆగంతకులు కాల్పులు.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
ఉప్పరపల్లిలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర కెమికల్స్ కలుపుతూ, శుభ్రత పాటించకుండా ఓ ముఠా అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్లం పేస్టు నిర్వాహకులు దిల్దర్ అలీ జాన్సన్, సోనుకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.