Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్

మొత్తం 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయల నగదును ఆమె వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది.

Police

హైదరాబాద్ శివారులోని నానక్‌రాం గూడలో గత రాత్రి గంజాయి లేడీ డాన్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతోంది లేడీ డాన్ నీతు.

ప్రతిరోజు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అమ్ముతోంది. గంజాయి అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించింది. నానక్‌రాం గూడలో భారీగా గంజాయితో పాటు కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయల నగదును ఆమె వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది.

నీతుని ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్ పై సైబరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవల ఇతర పలు ప్రాంతాల్లో సోదాలు పూర్తి చేసి పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు.

మూడు రోజుల క్రితమే 4.4 కిలోల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అల్లాపూర్‌లో, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఎల్‌ఎస్‌డీ, అత్తాపూర్‌లో గంజాయిని అమ్ముతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.

Chandini Chowdary : హీరోయిన్స్‌ని ఎవరూ ప్రశ్నలు అడగరు.. హీరోలని, డైరెక్టర్స్ నే అడుగుతారు.. చాందిని చౌదరి కామెంట్స్ వైరల్..