Hyderabad Crime : మంత్రి శంకర్ ముఠా అరెస్ట్.. 4 పీడీ యాక్ట్‌లు పెట్టినా మారలేదు!

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.

Hyderabad Crime

Hyderabad Crime : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మంత్రి శంకర్‌ తోపాటు అతడి ముఠా సభ్యులైన సయ్యద్ అసద్, సయ్యద్ మెహరాజ్, మహ్నద్ మొహిజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సైదాబాద్ పోలీసులు.

నిందితుడు మంత్రి శంకర్ పై 260 దొంగతనం కేసులు ఉండగా 209 కేసుల్లో శిక్ష ఖరారైంది. నాలుగు సార్లు పీడీ యాక్ట్ పెట్టినా మంత్రి శంకర్ తీరు మారలేదని పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 14న జైలు నుంచి విడుదలై మళ్లీ ముగ్గురితో కలిసి దొంగతనం ప్లాన్ చేశాడు. తాజాగా ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.

 

Also Read : Hyderabad: ఈ ఆదివారం ఫన్ డే లేకపోవడానికి కారణమిదే..