Hyderabad: ఈ ఆదివారం ఫన్ డే లేకపోవడానికి కారణమిదే..

వారం రోజులకోసారి ట్యాంక్ బండ్ వేదికగా జరిగే సండే - ఫండే ఈవెంట్ జనవరి 2 ఆదివారం రద్దు అయింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గేదరింగ్స్ నిషేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: ఈ ఆదివారం ఫన్ డే లేకపోవడానికి కారణమిదే..

Sunday Funday

Hyderabad: వారం రోజులకోసారి ట్యాంక్ బండ్ వేదికగా జరిగే సండే – ఫండే ఈవెంట్ జనవరి 2 ఆదివారం రద్దు అయింది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గేదరింగ్స్ నిషేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవెంట్ రద్దు కారణంగా ఈ రూట్ లో ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఉండవని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు.

సాధ్యమైనంత వరకూ సోషల్ యాక్టివిటీ తగ్గించాలనే ఉధ్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఫండే కార్యక్రమం నిర్వహిస్తే.. కాంటాక్టింగ్ పెరిగి ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం కావొచ్చని భావించినట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు అరవింద్ కుమార్.

ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, మాస్ గేదరింగ్స్ లాంటివన్నింటినీ రద్దు చేసింది. జనవరి 10వరకూ మతపరమైన, రాజకీయ, సాంస్క్రృతికపరమైన గేదరింగ్స్ కూడా ఉండబోవని హెచ్చరించింది. తప్పనిసరైన జాగ్రత్తలు పాటించాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సూచించారు.

ఇది కూడా చదవండి : ఉల్లి సాగులో యాజమాన్య పద్దతులు