Congress : హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్‌

తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్‌కు పోలీసులు చెక్‌ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కార్యకర్తలను అడ్డుకున్నారు.

Congress (4)

Lathicharge on Congress workers : తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్‌కు పోలీసులు చెక్‌ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ టు ఎల్బీనగర్‌ వరకు తెలంగాణ కాంగ్రెస్‌ తలపెట్టిన జంగ్ సైరన్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌తో పలువురు నాయకులను దిల్‌సుఖ్‌నగర్‌లో అరెస్టు చేసి చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

WhatsApp : 20 లక్షల భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్

జంగ్ సైరన్ నేపథ్యంలో… ముందస్తుగా దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు దుకాణాలను క్లోజ్ చేయించారు. మెట్రో స్టేషన్‌ను మూసివేయించారు. ఆ తర్వాత ఎక్కడికక్కడా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు… వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఎల్బీనగర్‌లో తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా… పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది దీంతో ఎల్బీనగర్‌ టు సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. మధుయాష్కీ, దాసోజు శ్రావణ్‌, మల్లు రవిని అరెస్ట్ చేశారు.

Roja daughter: ఎమ్మెల్యే రోజా కుమార్తెకు “యంగ్ సూపర్‌స్టార్” అవార్డు

కాంగ్రెస్ జంగ్ సైరన్‌ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో ఆయన తన నివాసం వద్దే ధర్నాకు దిగారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ఉద్రిక్తత, అరెస్ట్‌లకు దారితీసింది.