Bandi Bhagirath Case: ఆరోజు ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? బండి భగీరథ్ స్నేహితులను ప్రశ్నించిన పోలీసులు..
ఇదే కేసుకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.
Bandi Bhagirath Case: తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్స్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. బండి భగీరథ్ స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మరోవైపు ఇదే కేసుకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. హైకోర్ట్ జడ్జిపై ఆరోపణలు చేసిన వారిని గుర్తించేందుకు రంగం సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వారి ఐపీ అడ్రస్ లు సేకరించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు సైబర్ క్రైమ్ పోలీసులు.
బండి భగీరథ్ ను 10 రోజుల కస్టడీకి తీసుకునేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక భగీరథ్ ఫ్రెండ్ ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. బాలికను ట్రాప్ చేయడంతో పాటు అతడికి సహకరించిన వారి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలు మూడోసారి జడ్జి ముందు వాంగ్మూలం ఇవ్వడం, కేసులో అదనపు సెక్షన్లు జోడించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి భగీరథ్ ఫ్రెండ్స్ వివరాలు ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ ను విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సింగిల్ బెంచ్ జడ్జి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో కొందరు ఆరోపణలు చేశారు. విచారణ సందర్భంగా తన కుటుంబంపై వచ్చిన ట్రోల్స్ పట్ల హైకోర్టు జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. నిరాధారమైన పోస్టులు పెట్టిన వ్యక్తులను గురించి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.
Also Read: మొయినాబాద్ జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్.. అప్పులు ఇచ్చిన 8మందిని చంపేందుకు ప్లాన్
