జూన్ 6న రాహుల్ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారనడానికి ఈ సభ సాక్ష్యంగా నిలవాలి: పొంగులేటి

మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు.

Ponguleti Srinivas Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 6న ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారనడానికి తుక్కుగూడ సభ సాక్ష్యంగా నిలవాలని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. “జన జాతర” పేరిట ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.

దీనిపై పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. తాము ఇచ్చిన 6 గారంటీలతో పాటు ఇవ్వని హామీలను కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని భద్రాచలంలో ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ పరిస్థినిపై శ్వేత పత్రం ద్వారా తెలియజేశామని చెప్పారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అన్నారు. నీళ్లు, నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిందని చెప్పారు.

ఈ సారి 56 శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందని తెలిపారు. తెలంగాణలో 16 శాతం రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం రైతులపై ప్రేమ చూపుతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని చెప్పారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ చేయడానికి కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు. బీజేపీ సర్కారు దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని నిలదీశారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్.. ఆ ముగ్గురికి లీగల్ నోటీసులు

ట్రెండింగ్ వార్తలు