ఆయన ధైర్యాన్ని నింపుతారు.. ఆశీర్వాదం తీసుకున్నాం: మంత్రి పొన్నం

తమది ప్రజా ప్రభుత్వమని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

ఆయన ధైర్యాన్ని నింపుతారు.. ఆశీర్వాదం తీసుకున్నాం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar

ధైర్యాన్ని ఇచ్చే కొండగట్టు అంజన్న ఆశీర్వాదాన్ని తీసుకున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆ దేవుడిని ప్రార్థించామని తెలిపారు.

తమది ప్రజా ప్రభుత్వమని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ ని గెలిపించాలని కార్యకర్తలు అడగాలన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఐక్యంగా అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారని చెప్పారు. 2,500 బూత్‌లలో మెజారిటీ బూత్‌లు గెలవాలని అన్నారు.

ఇక్కడి నుంచి ఐదేళ్లు బండి సంజయ్, ఐదేళ్లు వినోద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారు ఈ ప్రాంతానికి ఏం చేశారో శ్వేత పత్రం రూపంలో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. తాము ఏం చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు. ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు.

కొండగట్టు, వేములవాడకి బండి సంజయ్ ఏమైనా చేశారా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాముడి ఫొటో చూపిస్తూ ఓట్లగకూడదని, ఏంతో చేశారో చెప్పి బండి సంజయ్ ఓట్లు అడగాలని అన్నారు. తమ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో పాటు గతంలో తాము ఇచ్చిన హామీలు కూడా అమలు చేశామని తెలిపారు.

Also Read : ప్రచారంలో దూకుడు పెంచుతున్న కమలనాథులు.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్లాన్