Minister Ponnam Prabhakar
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న వేళ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వివరాలు తెలిపారు. ప్రతి 150 ఇళ్లకు ఓ ఎనిమరేటర్ ఉంటారని తెలిపారు. 56 ప్రశ్నలకు సంబంధించి అన్ని వివరాలు తీసుకుంటారని చెప్పారు.
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని, అందరూ సమాచారం ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అసమానతలు తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,000 ఇళ్లకు సంబంధించి సమాచారం సేకరిస్తామని తెలిపారు.
ఎన్యుమరేటర్లు ప్రజల డౌట్లు తీర్చే విధంగా సర్వే చేయాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సర్వే ద్వారా తెలంగాణలో సామాజిక పరిస్థితులు తెలుస్తాయని తెలిపారు. తాము చేస్తున్న మంచి పనులకు కొద్దిమంది అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చాలా పనులు చేస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఇళ్లకు స్టికర్లు వేయనున్నారు. 9వ తేది నుంచి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించనున్నారు.
Pawan Kalyan: ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సాయంత్రం అమిత్ షాతో భేటీ.. పవన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి