Pawan Kalyan: ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సాయంత్రం అమిత్ షాతో భేటీ.. పవన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కానుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ..

Pawan Kalyan
Pawan Kalyan Delhi Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న పవన్.. సాయంత్రం 6.30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖా మంత్రితో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
Also Read: 5 నెలలకే హోంశాఖపై పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు: అంబటి రాంబాబు
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కానుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షాతో భేటీలో పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పోలీసు అధికారుల పనితీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మంగళవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అయితే, అమిత్ షాతో భేటీలో పవన్ ఈ రెండు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమిత్ షాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు.