5 నెలలకే హోంశాఖపై పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు: అంబటి రాంబాబు
లా అండ్ ఆర్డర్ సరిగా లేవంటూ ప్రజలు తిడుతున్నారంటే కూటమి ప్రభుత్వం విఫలమైనట్లేనని అంబటి రాంబాబు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. ఇవాళ అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… 5 మాసాలకే ఉప ముఖ్యమంత్రి హోంశాఖపై వ్యాఖ్యలు చేశారని అన్నారు.
లా అండ్ ఆర్డర్ సరిగా లేవంటూ ప్రజలు తిడుతున్నారంటే కూటమి ప్రభుత్వం విఫలమైనట్లేనని అంబటి రాంబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పిల్లలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. 33 వేల మంది మహిళలు వైసీపీ పాలనలో మిస్సింగ్ అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళనైనా తీసుకువచ్చారా అని నిలదీశారు.
నేరం చేసిన వారిని భారత రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో హాజరు పరిచి శిక్ష పడేలా చేయాలని అంబటి రాంబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అసమర్థత ప్రదర్శిస్తున్నారని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఒకవేళ పవన్ హోం మంత్రి అయితే జనసేన కార్యకర్తలను డీఎస్పీలుగా చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీలాంటి నాయకులనే ప్రజలు ఎన్నికల్లో ఓడగొట్టారని, అధికారం శాశ్వతంగా ఉండదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. బావర్చీ బిర్యానీ తింటూ మాట్లాడుకుందామని హోటల్‌లో విద్యార్థుల వెయిటింగ్