Pregnant Suicide : గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు?

అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు.

Pregnant Suicide : గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు?

Suicide

Updated On : March 16, 2022 / 5:49 PM IST

Pregnant woman suicide : హనుమకొండ బ్యాంక్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణీగా ఉన్న యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త ప్రవీణ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల క్రితం అనూష అనే యువతికి ప్రవీణ్‌లో వివాహమైంది.

అప్పటికే ఆమె ఆంధ్రా బ్యాంకులో క్లర్‌గా పనిచేసేది. ఆమె భర్త ప్రవీణ్‌ యూనియన్‌ బ్యాంకులో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో ప్రవీణ్‌కు 25 లక్షల కట్నంతో బంగారు ఆభరణాలు ఇచ్చినప్పటికీ.. అదనపు కట్నం కోసం వేధించేవాడని అనూష కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Krishna : వరకట్న వేధింపులు.. ఐదు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య

అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగ్గా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు.