Puvvada Ajay : ఆరోపణలు నిరూపిస్తే నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తా : పువ్వాడ అజయ్
రేవంత్ లేఖపై పువ్వాడ అజయ్ స్పందించారు. పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ నాపై గవర్నర్‌కు రేవంత్ చేసిన తప్పుడు ఫిర్యాదును ఖండిస్తున్నాంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Puvvada
Puvvada Ajay respond : పీజీ మెడికల్ సీట్ల దందాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్సెస్ మంత్రి పువ్వాడ అజయ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పీజీ సీట్ల భర్తీపై సవాళ్లు-ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల దందాపై గవర్నర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతర ప్రయివేటు వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రయివేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నారు. రేవంత్ లేఖపై పువ్వాడ అజయ్ స్పందించారు. పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ నాపై గవర్నర్‌కు రేవంత్ చేసిన తప్పుడు ఫిర్యాదును ఖండిస్తున్నాంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానంటూ సవాల్ విసిరారు. లేకుంటే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు.
High Court : ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య కేసు.. మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు
కాలేజీ ప్రతిష్టను భంగపరిచినందుకు చట్టపరమైన చర్యలు తప్పవని పువ్వాడ అన్నారు. మమత మెడికల్ కాలేజీలో పారదర్శకంగా పీజీ అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అలాంటప్పుడు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కు చెందిన మెడికల్ కాలేజీలలో…మెడికల్ కౌన్సిల్‌తో విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవకతవకలు జరగలేదని నిరూపితమైతే… తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా శిరసా వహిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు.