SI Suspend: రాసలీలల కేసులో జవహర్‌నగర్‌ ఎస్సై అనిల్‌ సస్పెండ్‌

జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహింస్తున్న ఎస్ఐ అనిల్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశాడు. కాగా శుక్రవారం పోలీస్ శాఖలోనే పనిచేసే ఓ మహిళతో అనిల్ రాసలీలలు బయటపడ్డాయి.

SI Suspend: రాసలీలల కేసులో జవహర్‌నగర్‌ ఎస్సై అనిల్‌ సస్పెండ్‌

Si Suspend

Updated On : June 5, 2021 / 7:51 PM IST

SI Suspend: జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహింస్తున్న ఎస్సై అనిల్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశాడు. కాగా శుక్రవారం పోలీస్ శాఖలోనే పనిచేసే ఓ మహిళతో అనిల్ రాసలీలలు బయటపడ్డాయి. తిమ్మాయిపల్లిలోని సైలెంట్‌ వాల్ట్‌ రిసార్ట్‌లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కీసర పోలీసులకు సమాచారం అందడంతో వారు దాడి చేసి ఎస్సైతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే అనిల్ ను సస్పెండ్ చేస్తూ మహేష్ భగవత్ ఆదేశాలు జారీచేశారు.